News October 20, 2025
APPLY NOW: 36 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ముంబైలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ (SAMEER) 36 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్‌ను బట్టి టెన్త్, ITI, NVCT/NAC, డిప్లొమా, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు OCT 31వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష,స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PWBDలకు రూ.100. వెబ్‌సైట్:sameer.gov.in/
Similar News
News October 20, 2025
ముత్యాల గర్భం గురించి తెలుసా?

ప్రెగ్నెంట్ అయినా కడుపులో బిడ్డలేని పరిస్థితినే ముత్యాల గర్భం అంటారు. కడుపు పెరుగుతుంది, వాంతులు అవుతాయి, ప్రెగ్నన్సీ హార్మోన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఆరోగ్యకరమైన స్పెర్మ్ , ఒక ఆరోగ్యకరమైన అండంతో సంయోగం చెందితే పిండం ఏర్పడుతుంది. అలా రెండు క్రోమోజోములు బిడ్డకు వస్తాయి. కానీ ముత్యాల గర్భం శుక్రకణం క్రోమోజోములు లేని ఖాళీ అండంతో ఏర్పడుతుంది. ఇది బుడగల ఆకారంలో ఎదుగుతుంది.
News October 20, 2025
‘డ్యూడ్’, ‘K-Ramp’ కలెక్షన్లు ఎంతంటే?

* ప్రదీప్, మమితా బైజు కాంబోలో వచ్చిన డ్యూడ్ మూవీ 3 రోజుల్లో రూ.66 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.22 కోట్లు, రెండో రోజు రూ.23 కోట్లు, నిన్న రూ.21 కోట్లు రాబట్టింది.
* కిరణ్ అబ్బవరం, యుక్తి జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ 2 రోజుల్లో రూ.5.1 కోట్లు(నెట్) కలెక్ట్ చేసినట్లు Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ తెలిపింది.
News October 20, 2025
బాబర్ పని అయిపోయిందా?

పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ పేలవ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 16 పరుగులకే ఔటయ్యారు. బాబర్ గత 75 ఇన్నింగ్సుల్లో ఒక్క ఇంటర్నేషనల్ సెంచరీ కూడా చేయలేదు. సొంతగడ్డపై జరిగిన టెస్టుల్లోనూ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. గత 15 టెస్టు ఇన్నింగ్సుల్లో అతడి స్కోర్లు 24, 27, 0, 22, 31, 11, 30, 5, 8, 5, 1, 31, 23, 42, 16గా ఉన్నాయి. సగటు 18.40 కాగా హాఫ్ సెంచరీ కూడా బాదలేకపోయారు.