News October 20, 2025
KNR: బ్యాంకులో వింత పొకడలు.. దేనికి సంకేతం..?

డైరెక్టర్ల తొలగింపు, కేసులు, పార్టీల జోక్యంతో KNR కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అప్రతిష్టను మూటగట్టుకుంది. నిన్నటివరకు ఛైర్మన్‌గా ఉన్న విలాస్ రెడ్డి నామినేటెడ్ పోస్టులో ఛైర్మన్ అయ్యాడు. దీనికితోడు బ్యాంక్ ఎన్నికల్లో ప్యానెల్ ఏర్పాటుకు CONG, BJP, BRSల ప్లాన్లు వింత పోకడలను సూచిస్తోంది. బ్యాంకులో 9,287 మందికి సభ్యత్వం ఉంది. రేపట్నుంచి 23 వరకు నామినేషన్లు, NOV 1న పోలింగ్, 4లోపు పాలకమండలి కొలువుదీరనుంది.
Similar News
News October 20, 2025
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న సీపీ

కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నారు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద విద్యార్థులతో ఆశీర్వచనం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, చేర్యాల CI శ్రీనివాస్, SI రాజు గౌడ్ పాల్గొన్నారు.
News October 20, 2025
సత్నాల ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

సత్నాల ప్రాజెక్టులో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇంద్రవెల్లికి చెందిన బాలాజీ(37) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరు నెలల క్రితం ఉపాధి కోసం రామాయిగూడకు వలస వెళ్లిన బాలాజీ స్థానిక చికెన్ సెంటర్‌లో సీసా కమ్మరి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసైన బాలాజీ శనివారం రాత్రి భార్య, అత్తతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయాడు. ఆదివారం సత్నాల ప్రాజెక్టులో దూకి చనిపోయాడు.
News October 20, 2025
పొన్నూరు: ఫొటో కోసం చీరలో రూ.1లక్ష పెట్టమన్నాడు.. చివరకు

పొన్నూరులో సినిమాను తలపించేలా ఘరానా మోసం జరిగింది. విద్యానిగర్‌లోని రాధాకృష్ణమూర్తి ఇంట్లో చొరబడిన దొంగ, బహుమతులు వచ్చాయని నమ్మించి, ఫొటో తీయడానికి లక్ష రూపాయల నగదును చీరలో పెట్టి ఉంచాలని చెప్పాడు. ఆ తర్వాత ఆ లక్ష తీసుకొని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ వీరా నాయక్ తెలిపారు.