News October 20, 2025
ఎస్పీ రోహిత్ రాజు దీపావళి విషెస్

జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ రోహిత్ రాజు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వెలుగుల మధ్య ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని కోరారు.
Similar News
News October 20, 2025
సత్నాల ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

సత్నాల ప్రాజెక్టులో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇంద్రవెల్లికి చెందిన బాలాజీ(37) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరు నెలల క్రితం ఉపాధి కోసం రామాయిగూడకు వలస వెళ్లిన బాలాజీ స్థానిక చికెన్ సెంటర్‌లో సీసా కమ్మరి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసైన బాలాజీ శనివారం రాత్రి భార్య, అత్తతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయాడు. ఆదివారం సత్నాల ప్రాజెక్టులో దూకి చనిపోయాడు.
News October 20, 2025
పొన్నూరు: ఫొటో కోసం చీరలో రూ.1లక్ష పెట్టమన్నాడు.. చివరకు

పొన్నూరులో సినిమాను తలపించేలా ఘరానా మోసం జరిగింది. విద్యానిగర్‌లోని రాధాకృష్ణమూర్తి ఇంట్లో చొరబడిన దొంగ, బహుమతులు వచ్చాయని నమ్మించి, ఫొటో తీయడానికి లక్ష రూపాయల నగదును చీరలో పెట్టి ఉంచాలని చెప్పాడు. ఆ తర్వాత ఆ లక్ష తీసుకొని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ వీరా నాయక్ తెలిపారు.
News October 20, 2025
వరంగల్: మాజీ MLA ఇంట్లో పేకాట.. 13 మంది అరెస్ట్

వరంగల్‌లో మాజీ MLA దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వీరిలో WGL స్టేషన్ రోడ్డు ప్రాంతానికి చెందిన హరిబాబు, కాజీపేటకు చెందిన సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, హంటర్ రోడ్డు శాయంపేట ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ శివశంకర్, మామునూరుకు చెందిన తిరుపతిరెడ్డి, గిర్మాజీపేటకు చెందిన శ్రీనివాసరావు, జావీద్, కొత్తవాడకు చెందిన రాజకిశోర్ తదితరులు ఉన్నారు.