News October 20, 2025
VKB: అనంతపద్మనాభ స్వామి ఆలయం మూసివేత

వికారాబాద్‌కు సమీపంలోని మహిమాన్విత అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని అమావాస్యను పురస్కరించుకుని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని ఆలయ మేనేజర్ నరేందర్ తెలిపారు. నిత్యం భక్తులు సందర్శించి, మొక్కులు తీర్చుకునే ఈ ఆలయాన్ని అమావాస్య ముగిసిన తర్వాత శుద్ధి చేసి తిరిగి తెరుస్తామని ఆయన వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.
Similar News
News October 20, 2025
ఏలూరు: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

ఏలూరులో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వట్లూరు సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతిదేహం పడి ఉండడంతో స్థానికులు జీఆర్పీలకు సమచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టానికి ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. రైల్వే HC శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 20, 2025
మీకు తెలుసా? దేవతల పుత్రుడే ‘నరకాసురుడు’

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడ్ని చంపి, వెలుగు నింపినందుకు గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అయితే ఆ నరకాసురుడు దేవతల పుత్రుడే అని మీకు తెలుసా? విష్ణుమూర్తి వరాహ అవతారానికి, భూదేవికి జన్మించిన కుమారుడే ఈ అసురుడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన ఇతను దుష్ట స్వభావాన్ని పెంచుకుని అసురుడిగా మారాడు. అహంకారం పెరిగి 16K రాజకుమార్తెలను బంధించాడు. తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేని వరం ఉండేది.
News October 20, 2025
ఇవాళ బిడ్డల ఇళ్లకు పితృదేవతలు!

దీపావళి నాడు సాయంత్రం పితృదేవతలు ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారని నమ్మకం. వారికి దారి కనిపించటం కోసమే పిల్లల చేత దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. వీధి గుమ్మం ముందు దివిటీలను వెలిగించి గుండ్రంగా మూడుసార్లు తిప్పి నేలకు కొట్టిస్తూ ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పలికిస్తారు.
* మరిన్ని దీపావళి విశేషాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.