News October 20, 2025
GREAT: ఎవరెస్ట్‌పై హైదరాబాదీ తల్లీకుమారుడు

ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌ను కాచిగూడకు చెందిన తల్లీకుమారుడు విజయవంతంగా అధిరోహించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శరణ్య (39) తన కుమారుడు శేయాంశ్ (12)తో కలిసి 8 రోజుల్లోనే 5,364 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు చేరుకున్నారు. అక్టోబర్ 5న ప్రారంభించిన ప్రయాణం 13న విజయవంతంగా ముగిసింది.
Similar News
News October 20, 2025
బండ్ల గణేశ్ ఇంటి నిండా టపాసులే

దీపావళి సందర్భంగా బండ్ల గణేశ్ తన ఇంట్లో వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇంటి నిండా టపాసులు పరిచి ఫొటోని షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘తెలుగు లోగిళ్లలో ఆరోగ్య, ఆనంద, విజయాల కాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు’ అంటూ బండ్ల ట్వీట్ చేశారు.
News October 20, 2025
HYD: దీపావళి.. ‘B New’లో స్పెషల్ ఆఫర్లు

దీపావళి సందర్భంగా B New మొబైల్స్ & ఎలక్ట్రానిక్స్ స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్లు ‘B New’ సంస్థ CMD వై.డి.బాలాజీ చౌదరి, CEO సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 150కిపైగా స్టోర్లతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ధరలు ఉన్నట్లు బాలాజీ చౌదరి వెల్లడించారు.
News October 20, 2025
HYD: రేపు దీపక్‌రెడ్డి నామిషన్ ర్యాలీకీ ప్రముఖులు

జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. యూసఫ్‌గూడ హైలంకాలనీ నుంచి షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ హాజరుకానున్నట్టు ధ్రువీకరించగా, అస్సాం, మహారాష్ట్ర సీఎంల కన్ఫర్మేషన్ కోసం టీబీజేపీ వెయిటింగ్.