News October 20, 2025
విజయనగరం: పలు గ్రామాలకు రాకపోకలు బంద్

మెంటాడ మండలంలోని ఆండ్ర జలాశయం నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో చంపావతి నది పొంగిపొర్లుతుంది. దీంతో జగన్నాథపురం, చాకివలస, ఆగూరు, మల్లేడివలస, గూడెం, సారాడవలస, గజపతినగరం మండలంలోని మర్రివలసకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సత్సంబంధాలు తెగిపోయినట్లే. ఎవరికైనా ప్రాణాపాయమైతే రిస్క్ చేసి నది దాటడం, లేదా కిలోమీటర్ల దూరం పంటపొలాల్లో డోలీద్వారా రోగిని అష్టకష్టాలు పడి తరలించాలి.
Similar News
News October 20, 2025
దీపంలోని దేవతలు.. మన కర్మలకు సాక్షిభూతులు

దీపం.. మన జీవితంలో ఓ భాగం. రోజూ ఉభయ సంధ్యలలో ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీప ప్రజ్వలన చేసిన తర్వాతే పండుగలు, పూజలు, శుభకార్యాలు, వేడుకలు ప్రారంభిస్తాము. వివాహాలనూ అగ్నిసాక్షిగా చేసుకుంటాం. దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉండి అనుగ్రహిస్తారని నమ్మకం. అందుకే దీపం వెలిగించటం అత్యంత ప్రధానమైనది. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి దీపావళి పండగను మహర్షులు ఏర్పాటు చేశారని ఓ విశ్వాసం.
News October 20, 2025
బండ్ల గణేశ్ ఇంటి నిండా టపాసులే

దీపావళి సందర్భంగా బండ్ల గణేశ్ తన ఇంట్లో వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇంటి నిండా టపాసులు పరిచి ఫొటోని షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘తెలుగు లోగిళ్లలో ఆరోగ్య, ఆనంద, విజయాల కాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు’ అంటూ బండ్ల ట్వీట్ చేశారు.
News October 20, 2025
NZB: రియాజ్ 47 కేసుల్లో అరెస్టు, 20 కేసుల్లో నిందితుడు

రియాజ్ ఇప్పటి వరకు 47 కేసుల్లో అరెస్టు అయినట్లు నిజామాబాద్ రూరల్ SHO ఆరీఫ్ తెలిపారు. ఇంకా 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. సమద్ డాన్ అండతో, రియాజ్ పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు చెప్పారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కూడా కత్తితో దాడి చేశాడని, సారంగాపూర్‌లో పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆసిఫ్‌ను కత్తితో తీవ్రంగా గాయపరిచాడని వివరించారు.