News October 20, 2025

అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ASF కలెక్టర్

image

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Similar News

News October 20, 2025

బెజ్జూర్: శ్రావణిది కుల దురహంకార హత్యే: ఏన్క అమృత

image

ఇటీవల దహేగాం మండలంలో జరిగిన గర్భిణి శ్రావణి హత్య కుల దురహంకార హత్యే అని ఆదివాసీ మహిళా సంఘం మండలాధ్యక్షురాలు ఏన్క అమృత అన్నారు. ఈరోజు బెజ్జూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నిండు గర్భిణి అయిన ఆదివాసీ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన ఆమె మామ సత్తయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు రెండు హత్యల కేసులు నమోదు చేయాలన్నారు.

News October 20, 2025

బాసర నుంచి మాహుర్ హైవే అనుసంధానానికి రూట్ మ్యాప్

image

బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి క్షేత్రం నుంచి మహుర్ రేణుకా మాత మందిరం వరకు రెండు జాతీయ రహదారుల అనుసంధానానికి రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తే ఆధ్యాత్మిక మార్గం ఏర్పడుతుందని ప్రస్తావించడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారని, ఈ మేరకు సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారని చెప్పారు.

News October 20, 2025

దీపంలోని దేవతలు.. మన కర్మలకు సాక్షిభూతులు

image

దీపం.. మన జీవితంలో ఓ భాగం. రోజూ ఉభయ సంధ్యలలో ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీప ప్రజ్వలన చేసిన తర్వాతే పండుగలు, పూజలు, శుభకార్యాలు, వేడుకలు ప్రారంభిస్తాము. వివాహాలనూ అగ్నిసాక్షిగా చేసుకుంటాం. దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉండి అనుగ్రహిస్తారని నమ్మకం. అందుకే దీపం వెలిగించటం అత్యంత ప్రధానమైనది. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి దీపావళి పండగను మహర్షులు ఏర్పాటు చేశారని ఓ విశ్వాసం.