News October 20, 2025
కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం రావాలి: జాన్‌వెస్లీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గెర్రె గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్రంగా ఖండించారు. కాచిగూడలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని, కుల, మతాంతర వివాహితుల రక్షణచట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News October 20, 2025
అరటిలో మాంగనీసు ధాతు లోపం – నివారణ

అరటి తోటలో మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. మాంగనీసు ధాతులోపం తీవ్రమైతే ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో తెల్లగా మారి లోపం తీవ్రమైనప్పుడు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.
News October 20, 2025
కొయ్యూరు: 3 సార్లు జెడ్పీటీసీ.. ఒకసారి జెడ్పీ వైస్ చైర్మన్

కొయ్యూరు మండల జెడ్పీటీసీ వారా నూకరాజు సోమవారం రోలుగుంట మండలంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. చిట్టెంపాడుకు చెందిన నూకరాజు ఒకసారి సీపీఐ తరపున, రెండుసార్లు వైసీపీ తరపున జెడ్పీటీసీగా గెలిచారు. 2001-06 మధ్యలో విశాఖ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గానూ పనిచేశారు. ఆయనకు కొంతకాలంగా ఛటర్జీపురం గ్రామానికి చెందిన భూముల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి చంపేశారు.
News October 20, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేదారేశ్వర నోముల సంబరాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేదారేశ్వర నోములు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో కేదారేశ్వరుడికి పూజలు అర్పించి కుటుంబ శ్రేయస్సు, ధనసంపద కోసం ప్రార్థించారు. గ్రామాలంతా హారతుల కాంతులతో కళకళలాడగా, నోముల పాటలు, వంటల సువాసనలతో భక్తి వాతావరణం నెలకొంది. ఈసారి అమావాస్య రెండ్రోజులు రావడంతో కొందరు నేడు, మరి కొందరు మంగళవారం నోముకుని బుధవారం ఎత్తుకోనున్నారు. మీ నోములు ఎప్పుడు?