News October 20, 2025

తిరువూరు గొడవలకు ఆ ఇద్దరి నేతల ఆధిపత్యమే కారణమా?

image

తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పదవుల కేటాయింపు, ఆర్థిక వనరుల విషయంలో ఇద్దరు తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం ముదురుతోందని టాక్. కొలికపూడి నేనే బాస్‌ అని భావిస్తుండగా, ఎంపీ చిన్ని తన వర్గానికి వాటా కావాలని పట్టుబడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిష్ఠానం జోక్యం చేసుకున్నా ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడంతో వివాదాలు కొనసాగుతున్నాయంట.

Similar News

News October 20, 2025

ప.గో: అక్టోబర్ 23 నుంచి అండర్-14,17 పోటీలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని స్కూల్ యాజమాన్యాలకు అండర్-14,17 బాల,బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 23న వాలీబాల్ ఎన్టీఆర్ స్టేడియంలో కొవ్వూరులో అక్టోబర్ 24న ఫుట్ బాల్ దేవరపల్లి ఏ ఎస్‌ఎస్‌ఆర్ జిల్లా పరిషత్‌లో ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నామన్నారు.

News October 20, 2025

అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయండి: SP

image

పోలీస్ అమర వీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పిలుపు నిచ్చారు. సోమవారం ఆయన
తన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈనెల 21 నుంచి 31 వరకు వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ప్రజలు, విద్యార్థులు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో దేశ రక్షణ, ప్రజల భద్రతలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ.. జిల్లాలో ర్యాలీలు, వారోత్సవాలను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

News October 20, 2025

ఇతిహాసాలు క్విజ్ – 41 సమాధానాలు

image

1. దశరథుడి ప్రధాన మంత్రి పేరు ‘సుమంత్రుడు’.
2. నకుల, సహదేవుల తల్లి ‘మాద్రి’.
3. విష్ణువు నివాసం ఉండే లోకం పేరు ’వైకుంఠం’.
4. పంచాంగం అంటే ‘5’ ముఖ్యమైన అంశాల సమాహారం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం.
5. అన్నవరంలో కొలువై ఉన్న దేవుడు ‘సత్యనారాయణ స్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>