News October 20, 2025
VJD మెథడ్ అంటే ఏంటి?

క్రికెట్ మ్యాచ్‌కు అంతరాయం కలిగినప్పుడు ఓవర్లు కుదించేందుకు, టార్గెట్ రివైజ్ చేసేందుకు డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్(DLS) మెథడ్ ఉపయోగించడం తెలిసిందే. దీనికి బదులుగా వి.జయదేవన్ తన పేరుతో <<18055833>>VJD<<>> మెథడ్ కనిపెట్టారు. ఇందులో సాధారణ అంచనాతో పాటు మ్యాచ్ రీస్టార్ట్ అయ్యాక బ్యాటర్లు దూకుడుగా ఆడే అంశాన్నీ పరిగణించి టార్గెట్ సెట్ చేస్తారు. ఓవర్లు, వికెట్లతో పాటు రియల్ మ్యాచ్ కండీషన్స్‌నూ అంచనా వేసేలా డిజైన్ చేశారు.
Similar News
News October 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 41 సమాధానాలు

1. దశరథుడి ప్రధాన మంత్రి పేరు ‘సుమంత్రుడు’.
2. నకుల, సహదేవుల తల్లి ‘మాద్రి’.
3. విష్ణువు నివాసం ఉండే లోకం పేరు ’వైకుంఠం’.
4. పంచాంగం అంటే ‘5’ ముఖ్యమైన అంశాల సమాహారం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం.
5. అన్నవరంలో కొలువై ఉన్న దేవుడు ‘సత్యనారాయణ స్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 20, 2025
జుట్టు పెరగాలంటే హెయిర్ కట్ తప్పనిసరా?

జుట్టును కొద్దిగా కత్తిరించుకుంటే వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ జుట్టు పెరగడానికి హెయిర్‌కట్‌కి సంబంధం లేదంటున్నారు నిపుణులు. కానీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చివర్లు కత్తిరించడం మంచిదని సూచిస్తున్నారు. స్ప్లిట్ ఎండ్స్ వల్ల జుట్టు నిర్జీవంగా, గడ్డిలా తయారవుతుంది. కాబట్టి 3-4 నెలలకోసారి చివర్లు కత్తిరిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. <<-se>>#Haircare<<>>
News October 20, 2025
అరటిలో మాంగనీసు ధాతు లోపం – నివారణ

అరటి తోటలో మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. మాంగనీసు ధాతులోపం తీవ్రమైతే ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో తెల్లగా మారి లోపం తీవ్రమైనప్పుడు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.