News October 20, 2025
మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ 8 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 24లోపు దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ, డిప్లొమా, LLB, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
Similar News
News October 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 41 సమాధానాలు

1. దశరథుడి ప్రధాన మంత్రి పేరు ‘సుమంత్రుడు’.
2. నకుల, సహదేవుల తల్లి ‘మాద్రి’.
3. విష్ణువు నివాసం ఉండే లోకం పేరు ’వైకుంఠం’.
4. పంచాంగం అంటే ‘5’ ముఖ్యమైన అంశాల సమాహారం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం.
5. అన్నవరంలో కొలువై ఉన్న దేవుడు ‘సత్యనారాయణ స్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 20, 2025
జుట్టు పెరగాలంటే హెయిర్ కట్ తప్పనిసరా?

జుట్టును కొద్దిగా కత్తిరించుకుంటే వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ జుట్టు పెరగడానికి హెయిర్‌కట్‌కి సంబంధం లేదంటున్నారు నిపుణులు. కానీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చివర్లు కత్తిరించడం మంచిదని సూచిస్తున్నారు. స్ప్లిట్ ఎండ్స్ వల్ల జుట్టు నిర్జీవంగా, గడ్డిలా తయారవుతుంది. కాబట్టి 3-4 నెలలకోసారి చివర్లు కత్తిరిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. <<-se>>#Haircare<<>>
News October 20, 2025
అరటిలో మాంగనీసు ధాతు లోపం – నివారణ

అరటి తోటలో మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. మాంగనీసు ధాతులోపం తీవ్రమైతే ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో తెల్లగా మారి లోపం తీవ్రమైనప్పుడు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.