News October 20, 2025
రోజుకు 213 మందికి జన్మనిస్తున్న హైదరాబాద్

హైదరాబాద్.. మహానగరం దాదాపు కోటి మంది జనాభా ఉన్న సిటీ.. ఇక్కడ రోజూ వందలాది మంది పురుడుపోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనభ ఉన్న నగరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన CRS (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) నివేదికలో తేలింది. 2023వ సంవత్సరంలో సిటీలో 76,740 మంది జన్మించారు. అంటే సగటున నెలకు 6,395 మంది.. రోజుకు 213 మంది ఈలోకాన్ని చూశారన్న మాట.
Similar News
News October 20, 2025
ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి: చిరంజీవి

నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి. ప్రేమ, నవ్వు, కలిసి ఉండటం వల్ల జీవితం వెలిగిపోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తాయి’ అని ట్వీట్ చేశారు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో హీరోయిన్‌గా నయనతార, స్పెషల్ రోల్‌లో వెంకీ మామ కనిపించనున్నారు.
News October 20, 2025
ఇబ్రహీంపట్నం: వడ్డీ వ్యాపారి వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక మనోవేదనకు గురైన ఇబ్రహీంపట్నం మం. యామాపూర్‌కు చెందిన ఏలేటి జనార్దన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యుల ప్రకారం.. జనార్దన్ నాలుగేళ్ల క్రితం మెట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారి వద్ద రూ.11 లక్షలు అప్పు తీసుకున్నారు. అధిక వడ్డీ వేధింపులతో వ్యాపారి ఆయన భూమిని సెల్ డీడ్ చేయించుకున్నాడు. అప్పు చెల్లించినా వేధింపులు కొనసాగుతుండడంతో జనార్దన్ ఆత్మహత్యకు యత్నించారు.
News October 20, 2025
రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో రేపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.