News October 20, 2025
HYD: బాలుడి చేతిలో బ్యాగ్.. అందులో బుల్లెట్

ప్రగతినగర్‌లో తల్లితో ఉంటున్న ఓ బాలుడు (12)ఇంట్లో ఉండటం ఇష్టం లేక మూసాపేట మెట్రో స్టేషన్‌కు బ్యాగుతో వచ్చాడు. సిబ్బంది తనిఖీ చేయగా షాక్‌కు గురయ్యారు. అందులో 9MM బుల్లెట్ బయటపడటంతో మెట్రో స్టేషన్ ఇన్‌ఛార్జికి చెప్పారు. కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. గతంలో బాలుడి తాత మిలిటరీలో పనిచేసి బుల్లెట్ ఇంట్లో ఉంచగా తెచ్చుకున్నాడని తేలింది. కేసు నమోదు చేసినట్లు SI గిరీష్ తెలిపారు.
Similar News
News October 20, 2025
ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి: చిరంజీవి

నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి. ప్రేమ, నవ్వు, కలిసి ఉండటం వల్ల జీవితం వెలిగిపోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తాయి’ అని ట్వీట్ చేశారు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో హీరోయిన్‌గా నయనతార, స్పెషల్ రోల్‌లో వెంకీ మామ కనిపించనున్నారు.
News October 20, 2025
ఇబ్రహీంపట్నం: వడ్డీ వ్యాపారి వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక మనోవేదనకు గురైన ఇబ్రహీంపట్నం మం. యామాపూర్‌కు చెందిన ఏలేటి జనార్దన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యుల ప్రకారం.. జనార్దన్ నాలుగేళ్ల క్రితం మెట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారి వద్ద రూ.11 లక్షలు అప్పు తీసుకున్నారు. అధిక వడ్డీ వేధింపులతో వ్యాపారి ఆయన భూమిని సెల్ డీడ్ చేయించుకున్నాడు. అప్పు చెల్లించినా వేధింపులు కొనసాగుతుండడంతో జనార్దన్ ఆత్మహత్యకు యత్నించారు.
News October 20, 2025
రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో రేపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.