News October 20, 2025

రంప: 14 శతాబ్ద శివలింగం గురించి తెలుసా?

image

రంపచోడవరం నియోజకవర్గం రంపలోని శివాలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని 14వ శతాబ్దంలో నాగవంశీయులు ప్రతిష్ఠించారని పెద్దలు చెబుతారు. బిట్రీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు సైతం ఈ శివలింగాన్ని పూజించారు. రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించడం మరో విశేషం. ఈ ఆలయానికి మీరు ఎప్పుడైనా వెళ్లారా?

Similar News

News October 20, 2025

మేం మొదలుపెడితే తట్టుకోలేరు.. కేతిరెడ్డిపై జేసీ ఫైర్

image

AP: ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అంటున్నారు. అలా అంటే చూస్తూ ఊరుకోవాలా? మేం మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరు’ అని ఫైరయ్యారు. ఆయన ఆలోచించి మాట్లాడాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని అన్నారు.

News October 20, 2025

NZB: రియాజ్ మృతిపై ప్రమోద్ కుటుంబం హర్షం

image

నిజామాబాద్ జిల్లాలోని కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి పట్ల ఆయన భార్య ప్రణీత భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్పందించిన పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్‌పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు.

News October 20, 2025

కూతురిపై అత్యాచారానికి యత్నించాడని కొట్టిచంపిన తండ్రి!

image

తన కూతురిపై అత్యాచారానికి యత్నించిన కామాంధుడిని రాయితో కొట్టి చంపాడో తండ్రి. ఒడిశాలోని థెన్‌కనల్ జిల్లాలో జరిగిందీ ఘటన. కాలువలో స్నానం చేసేందుకు తండ్రితో కలిసి బాలిక (10) వెళ్లింది. స్నానం ముగించుకున్నాక పక్కకు వెళ్లిన సమయంలో కరుణాకర్ (27) అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడుపు విన్న తండ్రి వచ్చి బండరాయితో కొట్టి చంపాడు. తర్వాత స్థానిక పర్జంగ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.