News October 20, 2025
వనపర్తి: ఉచిత గిఫ్ట్ కోసం ఆశ పడొద్దు: SP

పండగ పేరిట ఉచిత గిఫ్టులు, రివార్డులు అంటూ సైబర్ నేరగాళ్లు పంపే లింకులు, ఏపీకే ఫైల్స్‌పై క్లిక్ చేయవద్దని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరించారు. ఎన్ఆర్ఐల పేరుతో మోసం చేసి, కస్టమ్స్ డ్యూటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తారన్నారు. ఉచిత గిఫ్టుల కోసం ప్రజలు ఆశపడకుండా, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు.
Similar News
News October 20, 2025
ప్రభుత్వం డీఏ జీఓను సవరించాలి: విజయ్

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీచేసిన 60, 61 జీఓలు అసంబద్ధంగా ఉంటూ ఉద్యోగికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని, వెంటనే జీవోలను సవరించాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. డీఏ అరియర్స్ పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని అనడం సరైనది కాదన్నారు.
News October 20, 2025
మన ఆచారాల వెనుక దాగున్న సైన్స్

మన సంప్రదాయాలు, ఆచారాల వెనుక ఆధ్యాత్మిక కారణాలే కాదు! ఆరోగ్య, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన పెద్దలు చెప్పులు ఇంటి బయటే వదలమంటారు. బయటకు వెళ్లి రాగానే కాళ్లూచేతులు కడగమంటారు. పుడితే పురుడని, మరణిస్తే అంటు అని అందరికీ దూరంగా ఉండాలంటారు. సెలూన్‌కి వెళ్తే స్నానం చేయనిదే ఇంట్లోకి రానివ్వరు. మహిళలు స్నానం చేయనిదే వండొద్దని అంటారు. వీటికి కారణం క్రిములను ఇంట్లోకి రాకుండా నిరోధించడమే.
News October 20, 2025
ఏర్పేడు: సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్‌కు దరఖాస్తు

ఏర్పేడు వద్ద గల IISER తిరుపతిలో సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్-01 పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మైక్రో బయాలజీ/ మాస్టర్స్ డిగ్రీ ఇన్‌మైక్రో బయాలజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు కింది వెబ్‌సైట్ చూడగలరు. https://www.iisertirupati.ac.in/jobs/advt_622025/ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 21 అన్నారు.