News October 20, 2025

రియాజ్ మృతిని ధ్రువీకరించిన DGP

image

TG: ఎన్‌కౌంటర్‌లో <<18056602>>రియాజ్<<>> మృతిని డీజీపీ శివధర్ రెడ్డి ధ్రువీకరించారు. ‘నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ బాత్రూం కోసం వెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసుల నుంచి వెపన్ తీసుకుని రియాజ్ కాల్పులకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడు’ అని డీజీపీ వెల్లడించారు.

Similar News

News October 20, 2025

బాణసంచా పేలి గాయమైతే..

image

బాణసంచా పేల్చే సమయంలో గాయపడితే కాలిన భాగాన్ని 15 నిమిషాల పాటు కుళాయి నీటితో శుభ్రంగా కడగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల పటాకుల వేడి ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా ఉంటుందని అంటున్నారు. అలాగే కాలిన భాగంలో పసుపు పొడి, పేస్ట్ వంటివి పూయకూడదని, దీనివల్ల గాయం ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడం కష్టం అవుతుందని తెలిపారు. పిల్లలు, వృద్ధులు ఉన్న చోట టపాకాయలు పేల్చవద్దని సూచిస్తున్నారు.

News October 20, 2025

సీఎం రేవంత్‌తో కొండా సురేఖ దంపతుల భేటీ

image

TG: సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెడ్డి వర్గమంతా కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత ఇటీవల చేసిన <<18019826>>ఆరోపణలు<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

News October 20, 2025

ప్రపంచం మొత్తానికి మీరు బాసా?.. ట్రంప్‌పై ఖమేనీ ఫైర్

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ‘మీరు మా న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేశామని చెబుతున్నారు. మీ ఊహల్లో మీరు ఉండండి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు మా సైంటిస్టులను చంపేశారు. కానీ వారి నాలెడ్జ్‌ను కాదు. ఒక దేశానికి న్యూక్లియర్ ఇండస్ట్రీ ఉంటే మీకు ఎందుకు? జోక్యం చేసుకోవడానికి మీరు ఎవరు? ప్రపంచం మొత్తానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా?’ అని ప్రశ్నించారు.