News October 20, 2025

పాలమూరు: కురుమూర్తి జాతర.. ‘ఉద్దాల’ ఉత్సవం అంటే..!

image

ప్రసిద్ధ కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ‘ఉద్దాల’ ఉత్సవం ప్రధాన ఘట్టం. స్వామివారి పాదుకలనే ‘ఉద్దాలు’ అని పిలుస్తారు. వీటిని వడ్డెమాన్‌కి చెందిన దళితులు నియమ నిష్ఠలతో తయారు చేస్తారు. రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన ఆవు చర్మంతో వీటి తయారీ జరుగుతుంది. దీపావళి అమావాస్య నుంచి సుమారు 7 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఉద్దాలతో తలపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

Similar News

News October 20, 2025

బాణసంచా పేలి గాయమైతే..

image

బాణసంచా పేల్చే సమయంలో గాయపడితే కాలిన భాగాన్ని 15 నిమిషాల పాటు కుళాయి నీటితో శుభ్రంగా కడగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల పటాకుల వేడి ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా ఉంటుందని అంటున్నారు. అలాగే కాలిన భాగంలో పసుపు పొడి, పేస్ట్ వంటివి పూయకూడదని, దీనివల్ల గాయం ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడం కష్టం అవుతుందని తెలిపారు. పిల్లలు, వృద్ధులు ఉన్న చోట టపాకాయలు పేల్చవద్దని సూచిస్తున్నారు.

News October 20, 2025

విశాఖలో జరిగే సీఐఐ సదస్సులో పాల్గొనండి: నారా లోకేష్

image

ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) ప్రతినిధులతో న్యూసౌత్ వేల్స్ పార్లమెంట్ ఆవరణలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల సాధించిన పెట్టుబడులను వివరించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్‌లో పాల్గొనవలసిందిగా కోరారు.

News October 20, 2025

సీఎం రేవంత్‌తో కొండా సురేఖ దంపతుల భేటీ

image

TG: సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెడ్డి వర్గమంతా కలిసి తమపై కుట్ర చేస్తున్నారంటూ సురేఖ కూతురు సుస్మిత ఇటీవల చేసిన <<18019826>>ఆరోపణలు<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.