News October 20, 2025

WGL: దీపావళి.. ‘B New’లో స్పెషల్ ఆఫర్లు

image

దీపావళి సందర్భంగా B New మొబైల్స్ & ఎలక్ట్రానిక్స్ స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్లు ‘B New’ సంస్థ CMD వై.డి.బాలాజీ చౌదరి, CEO సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 150కిపైగా స్టోర్లతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ధరలు ఉన్నట్లు బాలాజీ చౌదరి వెల్లడించారు.

Similar News

News October 20, 2025

పండుగ పూట విషాదం.. అయిజ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అయిజ-గద్వాల రోడ్డులో బింగిదొడ్డి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిజ మాలపేటకు చెందిన వీరేష్ మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వీరేష్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేసే వీరేష్ మృతితో అయిజలో పండుగపూట విషాదం నెలకొంది.

News October 20, 2025

దీపావళి వేడుకల్లో సీఎం దంపతులు

image

AP: సీఎం చంద్రబాబు దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంట్లో పూజ నిర్వహించారు. అనంతరం వారిద్దరూ కలిసి బాణసంచా కాల్చారు. దీపావళి వెలుగులు శాశ్వతం అవ్వాలని.. ప్రజలకు ప్రతిరోజు పండుగ కావాలని దేవుడిని ప్రార్థించానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

News October 20, 2025

BREAKING: బాసరలో విషాదం.. కాలు తెగిపోయింది..!

image

నిర్మల్ జిల్లా బాసర మండలం టాక్లి గ్రామంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు శివ ఎప్పటిలాగే తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ రోటవేటర్‌తో పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో అతడి కాలు ఇరుక్కొని తెగిపోయింది. స్థానికులు గమనించి శివను బయటకు తీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారొచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు.