News October 20, 2025
భద్రాచలంలో గ్యాంగ్ వార్ కలకలం..!

భద్రాచలం పట్టణంలో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి పాత మార్కెట్ వద్ద యువకులు ఘర్షణకు దిగారు. ఈ దాడిలో జగదీష్ నగర్ కాలనీకి చెందిన ప్రవీణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 20, 2025
వనపర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు బోనస్ ప్రశ్న..?

జిల్లాలో పది రోజుల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో, రబీలో సేకరించిన సన్నధాన్యం బోనస్ ఏమైందని రైతులు ప్రశ్నించే అవకాశం ఉందని పీఏసీఎస్, ఐకేపీ, మెప్మా అధికారులు ఆందోళన చెందుతున్నారు. రబీలో సేకరించిన సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇంకా ఇవ్వలేదన్నారు. ఖరీఫ్ ధాన్యం తెచ్చిన రైతులు రబీ బోనస్ అడిగితే ఏమి చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News October 20, 2025
అమితాబ్‌తో దురుసు ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన పిల్లాడు!

ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో హల్‌చల్ చేసిన పిల్లాడు గుర్తున్నాడా?<<17994167>>అమితాబ్‌తో దురుసుగా<<>> ప్రవర్తించి నెట్టింట వైరలయ్యాడు. ఈ మేరకు ఇషిత్ భట్ తన ప్రవర్తనకు సారీ చెబుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. ‘నేను అప్పుడు నర్వస్‌గా ఉన్నా. అంతేతప్ప దురుసుగా ప్రవర్తించడం నా ఉద్దేశం కాదు. అమితాబ్‌ను ఎంతో గౌరవిస్తా. ఈ ఘటనతో పెద్ద పాఠం నేర్చుకున్నా. భవిష్యత్తులో మరింత వినయంగా ఉంటానని మాటిస్తున్నా’ అని చెప్పాడు.
News October 20, 2025
వనపర్తి DCC అధ్యక్ష పదవికి 23 దరఖాస్తులు

వనపర్తి DCC అధ్యక్ష పదవికి మొత్తం 23 మంది దరఖాస్తు చేసుకున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. వనపర్తి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 19 మంది, దేవరకద్ర, మక్తల్ నుంచి ఇద్దరేసి చొప్పున దరఖాస్తు చేశారు. WNP నుంచి లక్కాకుల సతీష్, సాయి చరణ్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కిరణ్ కుమార్, తిరుపతయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏకాభిప్రాయంతో అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు జరుగుతోందని నేతలు చెబుతున్నారు.