News October 20, 2025
వరంగల్: మాజీ MLA ఇంట్లో పేకాట.. 13 మంది అరెస్ట్

వరంగల్‌లో మాజీ MLA దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వీరిలో WGL స్టేషన్ రోడ్డు ప్రాంతానికి చెందిన హరిబాబు, కాజీపేటకు చెందిన సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, హంటర్ రోడ్డు శాయంపేట ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ శివశంకర్, మామునూరుకు చెందిన తిరుపతిరెడ్డి, గిర్మాజీపేటకు చెందిన శ్రీనివాసరావు, జావీద్, కొత్తవాడకు చెందిన రాజకిశోర్ తదితరులు ఉన్నారు.
Similar News
News October 20, 2025
MBNR జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

@మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా దీపావళి సంబరాలు.
@రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లిలో టిప్పర్ ఢీకొని.. లారీ డ్రైవర్ మృతి.
@కౌకుంట్లలో ముగిసిన సదర్ ఉత్సవాలు.
@జడ్చర్లలో పిచ్చికుక్కల దాడి.. చిన్నారులకు గాయాలు.
@జాతీయస్థాయి SGF అండర్-17 వాలీబాల్ పోటీలకు నవాబుపేట యన్మంగండ్ల చెందిన జైనుద్దీన్ ఎంపిక.
@కురుమూర్తి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
@మిడ్జిల్ రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు.
News October 20, 2025
దర్శకుడిగా మారిన హీరో.. గుర్తుపట్టలేని విధంగా లుక్!

విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘మకుటం’ మూవీ నుంచి దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందులో విశాల్ సూట్ ధరించి తెల్లగడ్డం, కళ్లద్దాలతో గుర్తుపట్టలేని లుక్‌లో ఉన్నారు. ఈ మూవీతో తాను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నానని, పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశాల్ తెలిపారు. దుషార విజయన్, అంజలి తదితరులు నటిస్తున్న ఈ మూవీని RB చౌదరి నిర్మిస్తుండగా, GV ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
News October 20, 2025
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో బెల్లంపల్లి ఎమ్మెల్యే సమావేశం

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బెంగుళూరులోని ఆయన నివాసంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రానున్న స్థానిక ఎన్నికలు, గ్రామ స్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన పార్టీ బలోపేతం దిశగా సూచనలు అందించారు.