News October 20, 2025
ఇవాళ బిడ్డల ఇళ్లకు పితృదేవతలు!

దీపావళి నాడు సాయంత్రం పితృదేవతలు ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను సందర్శిస్తారని నమ్మకం. వారికి దారి కనిపించటం కోసమే పిల్లల చేత దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. వీధి గుమ్మం ముందు దివిటీలను వెలిగించి గుండ్రంగా మూడుసార్లు తిప్పి నేలకు కొట్టిస్తూ ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పలికిస్తారు.
* మరిన్ని దీపావళి విశేషాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
Similar News
News October 20, 2025
రియాజ్ ఎన్‌కౌంటర్‌పై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబం హర్షం

TG: రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంపై కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత ఆనందం వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్‌పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు. రియాజ్ <<18056853>>కత్తితో దాడి<<>> చేయడంతో కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయిన విషయం తెలిసిందే.
News October 20, 2025
కాసేపట్లో భారీ వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాసేపట్లో యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి ఉదయంలోపు వానలు పడతాయని పేర్కొన్నారు. అటు ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
News October 20, 2025
అమితాబ్‌తో దురుసు ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన పిల్లాడు!

ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో హల్‌చల్ చేసిన పిల్లాడు గుర్తున్నాడా?<<17994167>>అమితాబ్‌తో దురుసుగా<<>> ప్రవర్తించి నెట్టింట వైరలయ్యాడు. ఈ మేరకు ఇషిత్ భట్ తన ప్రవర్తనకు సారీ చెబుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. ‘నేను అప్పుడు నర్వస్‌గా ఉన్నా. అంతేతప్ప దురుసుగా ప్రవర్తించడం నా ఉద్దేశం కాదు. అమితాబ్‌ను ఎంతో గౌరవిస్తా. ఈ ఘటనతో పెద్ద పాఠం నేర్చుకున్నా. భవిష్యత్తులో మరింత వినయంగా ఉంటానని మాటిస్తున్నా’ అని చెప్పాడు.