News October 20, 2025

జగిత్యాల జిల్లాకు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్ జారీ

image

రానున్న 2-3 గంటల్లో జగిత్యాల జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ వరకు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. రైతులు, ప్రజలు వర్షం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News October 21, 2025

TODAY HEADLINES

image

☞ దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు
☞ INS విక్రాంత్ పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టింది: మోదీ
☞ TG: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్
☞ AP: ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు
☞ రాష్ట్రాలు పోటీపడితేనే భారత్ గెలుస్తుంది: మంత్రి లోకేశ్
☞ కూటమి ప్రభుత్వ పాలనలో ఒక్క దీపమైనా వెలిగిందా: జగన్

News October 21, 2025

సరిహద్దుల్లో 120 మంది టెర్రరిస్టులు?.. ఆర్మీ హైఅలర్ట్‌

image

జమ్మూకశ్మీర్‌లో LoC వెంబడి ఇండియన్ ఆర్మీ హైఅలర్ట్ ప్రకటించింది. పాక్ దళాలు, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలు పెరిగినట్లుగా గుర్తించింది. 120 మంది సాయుధ ఉగ్రవాదులు ఎల్వోసీ వెంబడి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని మల్టీ ఏజెన్సీల ద్వారా ఇన్‌పుట్స్ అందినట్లు సమాచారం. దీపావళి నేపథ్యంలో తాము పూర్తి అలర్ట్‌గా ఉన్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

News October 21, 2025

155% టారిఫ్స్ విధిస్తా.. చైనాకు ట్రంప్ వార్నింగ్

image

చైనాపై 155% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘సుంకాల రూపంలో చైనా నుంచి మనకు అపారమైన డబ్బు వస్తోంది. ప్రస్తుతం 55% చెల్లిస్తోంది. మనతో ఒప్పందం కుదుర్చుకోకపోతే నవంబర్ 1 నుంచి 155% చెల్లించాల్సి రావచ్చు’ అని హెచ్చరించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలకు ముందు ఆయన మాట్లాడారు. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ను సౌత్ కొరియాలో కలవనున్నట్లు వెల్లడించారు.