News October 20, 2025
అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయండి: SP

పోలీస్ అమర వీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పిలుపు నిచ్చారు. సోమవారం ఆయన
తన కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈనెల 21 నుంచి 31 వరకు వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ప్రజలు, విద్యార్థులు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో దేశ రక్షణ, ప్రజల భద్రతలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ.. జిల్లాలో ర్యాలీలు, వారోత్సవాలను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News October 21, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,080 పెరిగి ₹1,32,770కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,21,700గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.2000 తగ్గి, ప్రస్తుతం రూ.1,88,000 పలుకుతోంది. కాగా 6 రోజుల్లో వెండి ధర రూ.18వేలు తగ్గడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 21, 2025
విశాఖ: లెక్కల్లో తేడాలొస్తే భారీ మూల్యమే

GVMC పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్లు రికార్డుస్థాయిలో సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6నెలల్లోనే రూ.256.5 కోట్లు వసూలు కాగా, వచ్చే 6నెలల్లో మరో రూ.276.49 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి జీవీఎంసీ రెవెన్యూ విభాగం ‘లైన్ లిస్టింగ్’ పేరుతో 8 జోన్ల పరిధిలో ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలను పరిశీలిస్తుంది. లెక్కల్లో తేడాలొస్తే అధికారులు భారీగా పన్నులు విధిస్తున్నారు.
News October 21, 2025
విడాకులకు దారితీసే 4 కారణాలివే: నిపుణులు

వైవాహిక జీవితంలో విడాకులకు దారితీసే 4 ప్రధాన అంశాలపై మానసిక నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అవే.. సమర్థించుకోవడం, విమర్శించడం, ధిక్కారం, చెప్పింది వినకపోవడం. ‘ఈ లక్షణాలు భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ నాలుగు అంశాలను నియంత్రించకపోతే వివాహ రథం విడాకులవైపు వేగంగా పయనించడం ఖాయం’ అని నిపుణులు సూచిస్తున్నారు. సామరస్యం కోసం వాటిని దూరం పెట్టాలి. Share it