News October 20, 2025

ప.గో: అక్టోబర్ 23 నుంచి అండర్-14,17 పోటీలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని స్కూల్ యాజమాన్యాలకు అండర్-14,17 బాల,బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 23న వాలీబాల్ ఎన్టీఆర్ స్టేడియంలో కొవ్వూరులో అక్టోబర్ 24న ఫుట్ బాల్ దేవరపల్లి ఏ ఎస్‌ఎస్‌ఆర్ జిల్లా పరిషత్‌లో ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News October 21, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,080 పెరిగి ₹1,32,770కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,21,700గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.2000 తగ్గి, ప్రస్తుతం రూ.1,88,000 పలుకుతోంది. కాగా 6 రోజుల్లో వెండి ధర రూ.18వేలు తగ్గడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 21, 2025

విశాఖ: లెక్కల్లో తేడాలొస్తే భారీ మూల్యమే

image

GVMC పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్లు రికార్డుస్థాయిలో సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6నెలల్లోనే రూ.256.5 కోట్లు వసూలు కాగా, వచ్చే 6నెలల్లో మరో రూ.276.49 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి జీవీఎంసీ రెవెన్యూ విభాగం ‘లైన్ లిస్టింగ్’ పేరుతో 8 జోన్ల పరిధిలో ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలను పరిశీలిస్తుంది. లెక్కల్లో తేడాలొస్తే అధికారులు భారీగా పన్నులు విధిస్తున్నారు.

News October 21, 2025

విడాకులకు దారితీసే 4 కారణాలివే: నిపుణులు

image

వైవాహిక జీవితంలో విడాకులకు దారితీసే 4 ప్రధాన అంశాలపై మానసిక నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అవే.. సమర్థించుకోవడం, విమర్శించడం, ధిక్కారం, చెప్పింది వినకపోవడం. ‘ఈ లక్షణాలు భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ నాలుగు అంశాలను నియంత్రించకపోతే వివాహ రథం విడాకులవైపు వేగంగా పయనించడం ఖాయం’ అని నిపుణులు సూచిస్తున్నారు. సామరస్యం కోసం వాటిని దూరం పెట్టాలి. Share it