News October 20, 2025

BREAKING: బాసరలో విషాదం.. కాలు తెగిపోయింది..!

image

నిర్మల్ జిల్లా బాసర మండలం టాక్లి గ్రామంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు శివ ఎప్పటిలాగే తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ రోటవేటర్‌తో పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో అతడి కాలు ఇరుక్కొని తెగిపోయింది. స్థానికులు గమనించి శివను బయటకు తీసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారొచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు.

Similar News

News October 21, 2025

జనగామ: పంట కల్లాలకు మోక్షం ఎప్పుడో!

image

ధాన్యం దిగుబడి వచ్చిన రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాలు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పొలాలు, రహదారులపై ఆరబోసుకుంటున్నారు. జిల్లాలో రెండు లక్షలకు పైగా రైతులంటే కేవలం 4 వేల పంట కల్లాలు ఉండటం గమనార్హం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంట కల్లాల నిర్మాణం చేపట్టాలని జిల్లాల్లోని రైతులు కోరుతున్నారు.

News October 21, 2025

అమెరికన్లకు ట్రంప్ దీపావళి విషెస్

image

ప్రపంచ దేశాధినేతలు సైతం హిందువులనుద్దేశించి దీపావళి విషెస్ చెబుతారు. అయితే US అధ్యక్షుడు ట్రంప్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి అమెరికన్‌కు విషెస్ తెలియజేశారు. ఈ పండుగ కుటుంబాలను, స్నేహితులను, కమ్యూనిటీలను ఏకం చేసి నమ్మకాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అయితే హిందువులు, ఇండియన్స్‌ను విష్ చేయకుండా ట్రంప్ బుద్ధి చూపిస్తున్నాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News October 21, 2025

వరంగల్: ఆకతాయిలు వేధిస్తే సమాచారం ఇవ్వండి!

image

మహిళలు, విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఇన్‌స్పెక్టర్ సుజాత కోరారు. WGL ములుగు రోడ్డులోని ఓ ప్రవైయిట్ వస్త్రాలయంలోని ఉద్యోగులకు డయల్ 100, సైబర్ క్రైమ్, టీసేవ్ యాప్‌తో పాటు షీ టీం సేవలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దని, 8712685142కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు ఇన్‌స్పెక్టర్ సూచించారు.