News October 20, 2025
పండుగ పూట విషాదం.. అయిజ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అయిజ-గద్వాల రోడ్డులో బింగిదొడ్డి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిజ మాలపేటకు చెందిన వీరేష్ మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వీరేష్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేసే వీరేష్ మృతితో అయిజలో పండుగపూట విషాదం నెలకొంది.
Similar News
News October 21, 2025
ఈనెల 23న 10 కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

బనగానపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10 కార్పొరేట్ కంపెనీలు హాజరై నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు.
News October 21, 2025
ఇవాళ మధ్యాహ్నమే ‘మూరత్ ట్రేడింగ్’

దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ ఇవాళ మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు జరగనుంది. ఈ సమయంలో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌గా భావిస్తారు. గత ఏడాది ఈ సెషన్‌లో మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. కాగా ఇవాళ, రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు. మీరూ ‘మూరత్ ట్రేడింగ్’ చేస్తున్నారా?
News October 21, 2025
ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

దీపావళి వేళ దేశంలో చాలా ప్రాంతాలను వాయు కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలోని నరైనా గ్రామంలో నిన్న రాత్రి 11.39pmకు వాయు నాణ్యత సూచీ(AQI) 1991గా నమోదైంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘హమారా ఢిల్లీ’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కాగా హైదరాబాద్‌లోనూ అర్ధరాత్రి AQI 150కిపైగా నమోదైంది. ఈ వాతావరణం అనారోగ్యానికి దారి తీస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు.