News October 20, 2025
అమితాబ్‌తో దురుసు ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన పిల్లాడు!

ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో హల్‌చల్ చేసిన పిల్లాడు గుర్తున్నాడా?<<17994167>>అమితాబ్‌తో దురుసుగా<<>> ప్రవర్తించి నెట్టింట వైరలయ్యాడు. ఈ మేరకు ఇషిత్ భట్ తన ప్రవర్తనకు సారీ చెబుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు. ‘నేను అప్పుడు నర్వస్‌గా ఉన్నా. అంతేతప్ప దురుసుగా ప్రవర్తించడం నా ఉద్దేశం కాదు. అమితాబ్‌ను ఎంతో గౌరవిస్తా. ఈ ఘటనతో పెద్ద పాఠం నేర్చుకున్నా. భవిష్యత్తులో మరింత వినయంగా ఉంటానని మాటిస్తున్నా’ అని చెప్పాడు.
Similar News
News October 21, 2025
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే?

బ్రహ్మ ముహూర్తానికి విశేష ప్రాధాన్యం ఉంది. సూర్యోదయానికి ముందు వచ్చే ఈ పవిత్ర సమయాన్ని సాధనకు విశిష్టమైన కాలంగా ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ఈ ముహూర్తంలో నిద్రలేవడం వలన మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళన లేకుండా పోతుంది. ఈ వేళ లేచేవారి గుండె, మెదడు పనితీరు, ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విద్యార్థులు చదువుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీవకణాలు ఉద్రేకం పొంది, దైవికారోగ్యం లభిస్తుంది.
News October 21, 2025
ఇవాళ మధ్యాహ్నమే ‘మూరత్ ట్రేడింగ్’

దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ ఇవాళ మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు జరగనుంది. ఈ సమయంలో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌గా భావిస్తారు. గత ఏడాది ఈ సెషన్‌లో మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. కాగా ఇవాళ, రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు. మీరూ ‘మూరత్ ట్రేడింగ్’ చేస్తున్నారా?
News October 21, 2025
ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

దీపావళి వేళ దేశంలో చాలా ప్రాంతాలను వాయు కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలోని నరైనా గ్రామంలో నిన్న రాత్రి 11.39pmకు వాయు నాణ్యత సూచీ(AQI) 1991గా నమోదైంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘హమారా ఢిల్లీ’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కాగా హైదరాబాద్‌లోనూ అర్ధరాత్రి AQI 150కిపైగా నమోదైంది. ఈ వాతావరణం అనారోగ్యానికి దారి తీస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు.