News October 20, 2025
ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఇంట ప్రగతి వెలుగులు: సీతక్క

రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట సంక్షేమం, అభివృద్ధి వెలుగులు నిండాయని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2తో పాటు పలు ఉద్యోగ నియామకాలతో నిరుద్యోగుల ఇంట నిజమైన పండుగ జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సీతక్క దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
Similar News
News October 21, 2025
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే?

బ్రహ్మ ముహూర్తానికి విశేష ప్రాధాన్యం ఉంది. సూర్యోదయానికి ముందు వచ్చే ఈ పవిత్ర సమయాన్ని సాధనకు విశిష్టమైన కాలంగా ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ఈ ముహూర్తంలో నిద్రలేవడం వలన మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళన లేకుండా పోతుంది. ఈ వేళ లేచేవారి గుండె, మెదడు పనితీరు, ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విద్యార్థులు చదువుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీవకణాలు ఉద్రేకం పొంది, దైవికారోగ్యం లభిస్తుంది.
News October 21, 2025
ఈనెల 23న 10 కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

బనగానపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10 కార్పొరేట్ కంపెనీలు హాజరై నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు.
News October 21, 2025
ఇవాళ మధ్యాహ్నమే ‘మూరత్ ట్రేడింగ్’

దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ ఇవాళ మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు జరగనుంది. ఈ సమయంలో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌గా భావిస్తారు. గత ఏడాది ఈ సెషన్‌లో మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. కాగా ఇవాళ, రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు. మీరూ ‘మూరత్ ట్రేడింగ్’ చేస్తున్నారా?