News October 21, 2025

వరుసగా 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు గెలిచే అవకాశం ఉన్నా చివర్లో 2 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా, తొలి 4 బంతుల్లో వరుసగా 4 వికెట్లు పడ్డాయి. దీంతో SLకు ఊహించని విజయం దక్కింది. అంతకుముందు శ్రీలంక 202 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో WC నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా BAN నిలిచింది.

Similar News

News October 21, 2025

బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? అప్పుడేం చేయాలి?

image

బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 96 నిమిషాల ముందు వచ్చే పవిత్ర సమయం. ఇది 48 నిమిషాల పాటు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం.. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సమయం. ఈ వేళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయం జ్ఞానం, శారీరక పెరుగుదలకు అనుకూలం. ఈ వాతావరణంలో ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దైవ శక్తిని పెంపొందించుకోవడానికి ఇది ఉత్తమ సమయం.

News October 21, 2025

పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా షాహిన్ అఫ్రీది

image

మెన్స్ టీమ్ వన్డే కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలగించింది. బౌలర్ షాహీన్ అఫ్రీదిని నూతన సారథిగా నియమించింది. వచ్చే నెల 4న దక్షిణాఫ్రికాతో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 25 ఏళ్ల ఈ పేసర్ 66 వన్డేల్లో 131 వికెట్లు తీశారు. 2024లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అఫ్రీదికి ఉంది.

News October 21, 2025

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే?

image

బ్రహ్మ ముహూర్తానికి విశేష ప్రాధాన్యం ఉంది. సూర్యోదయానికి ముందు వచ్చే ఈ పవిత్ర సమయాన్ని సాధనకు విశిష్టమైన కాలంగా ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ఈ ముహూర్తంలో నిద్రలేవడం వలన మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళన లేకుండా పోతుంది. ఈ వేళ లేచేవారి గుండె, మెదడు పనితీరు, ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విద్యార్థులు చదువుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీవకణాలు ఉద్రేకం పొంది, దైవికారోగ్యం లభిస్తుంది.