News October 21, 2025

సుప్రీం ఆదేశాలు పట్టించుకోవట్లేదు: రాజ్‌దీప్

image

ఢిల్లీలో దీపావళి రోజున రాత్రి 8-10 గంటల మధ్య బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే 11pm దాటినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా టపాసులు కాలుస్తున్నారని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. SC ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యానికి ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా వాస్తవాన్ని పరిశీలించాలని కోరారు.

Similar News

News October 21, 2025

కూటమి VS కూటమి.. ప్రత్యర్థుల విమర్శలు

image

బిహార్‌లో మహా కూటమిలో విభేదాలు ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారాయి. కాంగ్రెస్, RJD, CPI, VIP పార్టీలు గ్రాండ్ అలయెన్స్‌గా ఏర్పడ్డాయి. అయితే 11 స్థానాల్లో కూటమి నేతలే పరస్పరం పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. 6 సీట్లలో RJD, కాంగ్రెస్, 4 స్థానాల్లో కాంగ్రెస్, CPI, మరో 2 చోట్ల RJD, VIP అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. NDA గెలుపునకు కూటమి బాటలు వేసిందని LJP చీఫ్ చిరాగ్ పాస్వాన్ విమర్శించారు.

News October 21, 2025

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా: కేటీఆర్

image

TG: తమ పార్టీలో ఉన్నామంటున్న MLAల పేర్లు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం ఏంటని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రశ్నించారు. ‘ఏ పార్టీలో ఉన్నావంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వారికి సిగ్గుందా?’ అని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆలిండియా కరప్షన్ కమిటీ అని, దానికి ఖర్గే, రాహుల్ గాంధీ నాయకులని ఖైరతాబాద్‌లో బస్తీ దవాఖానా సందర్శన సందర్భంగా KTR విమర్శించారు.

News October 21, 2025

రేపటి నుంచే కార్తీక మాసం

image

ఇవాళ్టితో ఆశ్వయుజ మాసం ముగిస్తుంది. రేపటి(OCT 22) నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం ప్రారంభమై నవంబర్‌ 20 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు. ఉదయం, సాయంత్ర వేళల్లో దీపాలు వెలిగిస్తూ, పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు, వనభోజనాలతో ఈ మాసమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది.