News October 21, 2025
అక్టోబర్ 21: చరిత్రలో ఈరోజు

1833: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జననం(ఫొటోలో-R)
1947: ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం
1967: అథ్లెట్ అశ్వినీ నాచప్ప జననం
1986: సినీ దర్శకుడు టి.కృష్ణ మరణం(ఫొటోలో-L)
1992: హీరోయిన్ శ్రీనిధి శెట్టి జననం
1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం
✦పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
Similar News
News October 21, 2025
రోహిత్, జైస్వాల్, అభిషేక్.. గిల్‌కి జోడీ ఎవరు?

మరో రెండేళ్ల(2027)లో మెన్స్ వన్డే CWC రానుంది. ఇప్పటి నుంచే ఆ టోర్నీలో ఓపెనింగ్ జోడీపై SMలో చర్చ మొదలైంది. T20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేలకే పరిమితమయ్యారు. అప్పటివరకు ఆయన కొనసాగుతారా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. అయితే జైస్వాల్-గిల్ జోడీ అయితే బెటరని కొందరు, అభిషేక్-గిల్ అని మరికొందరు, రోహిత్-గిల్ బెస్ట్ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఏ జోడీ అయితే బెటర్? COMMENT
News October 21, 2025
పని ప్రదేశాల్లో వేధింపులకు చెక్ పెట్టే షీ బాక్స్

పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు షీబాక్స్ పేరిట కేంద్రం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. పనిప్రదేశాల్లో వేదింపులు ఎదుర్కొన్న మహిళలు షీబాక్స్ వెబ్‌సైట్లో ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీతో ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. అది అందిన వెంటనే సంబందిత విచారణ విభాగానికి బదిలీ అవుతుంది. బాధిత మహిళల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతారు. వెబ్‌సైట్:<
News October 21, 2025
బీజేపీ-ఆప్ మధ్య ‘పొల్యూషన్’ పంచాయితీ

ఢిల్లీలో పొల్యూషన్ సమస్య బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీపావళి వేళ కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆప్ రాష్ట్రాధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దీంతో ఆ పార్టీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పంటల కాల్చివేత వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడింది. పొల్యూషన్‌కు దీపావళిని బ్లేమ్ చేయొద్దని హితవు పలికింది.