News October 21, 2025
ఈనెల 23న 10 కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

బనగానపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 10 కార్పొరేట్ కంపెనీలు హాజరై నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు.
Similar News
News October 21, 2025
ప.గో: జిల్లాస్థాయి ఎంపికలో 102 మంది ఎంపిక

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏలూరులో 2చోట్ల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14,17 జిల్లా స్థాయి ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహించామని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. జూడో క్రీడలకు 72 మంది హాజరు కాగా 30 మంది, స్కేటింగ్ 122 కి 62 మంది, సాఫ్ట్ టెన్నిస్ 30 కి 5 గురు, స్క్వాష్ క్రీడలకు 30 కి 5 గురు ఎంపికయ్యారన్నారు.16 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News October 21, 2025
ANU: ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్ ఫలితాలను మంగళవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఎల్‌ఎల్‌బీ 3-4, 5-8 సెమిస్టర్లలో 84.05%, ఎల్‌ఎల్‌బీ 5-4 సెమిస్టర్‌లో 63.02% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఏప్రిల్ 2025లో జరిగిన ఎల్‌ఎల్‌బీ 3-1, 5-5 రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను కూడా విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
News October 21, 2025
బాపట్ల జిల్లా పర్యాటక రంగానికి కీలకమైనది: కలెక్టర్

బాపట్ల జిల్లా పర్యాటక రంగానికి చాలా కీలకమైనదిగా ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం అన్నారు. ఆరు మండలాలలో సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. సముద్ర తీర ప్రాంతాలైన 17 పంచాయతీలలో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. 8 పంచాయతీ పరిధిలోని 9 బీచ్‌లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ఆదేశించారు. ఈ మేరకు సదరు పంచాయతీ సమావేశాలలో తీర్మానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.