News October 21, 2025
సలాం పోలీస్

భారత్-చైనా సరిహద్దుల్లోని అక్సాయ్ చిన్ వద్ద 1959 అక్టోబర్ 21న పంజాబ్ DSP కరమ్ సింగ్ నేతృత్వంలోని CRPF బృందం గస్తీ కాస్తోంది. అదే సమయంలో సియాచిన్ ఆక్రమణకు ప్రయత్నిస్తూ చైనా దాడులకు దిగింది. వీరిని ఎదుర్కొంటూ చేసిన పోరాటంలో 10 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. వారి సేవలను స్మరిస్తూ అప్పటి నుంచి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
Similar News
News October 22, 2025
వైట్‌హౌస్‌లోకి బుల్డోజర్లు.. కారణమిదే!

వరుస వివాదాలు చుట్టుముడుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా వైట్‌హౌస్‌లోని ఈస్ట్ వింగ్‌లో కొంతభాగాన్ని బుల్డోజర్లతో కూలగొట్టిస్తున్నారు. తన బాల్‌రూమ్ ప్రాజెక్టు ($250M) కోసం ఆయన ఇలా చేస్తున్నారు. కూల్చివేతల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అధికారిక విందులు, సమావేశాలు, నృత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగించే పెద్ద గదినే బాల్‌రూమ్/బాల్‌హాల్ అంటారు.
News October 22, 2025
TATA RECORD: 30 రోజుల్లో లక్ష కార్ల డెలివరీ

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల్లో లక్షకు పైగా కార్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే 33% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అత్యధికంగా నెక్సాన్ 38వేలు, పంచ్ 32వేల యూనిట్లను విక్రయించామని తెలిపింది. అలాగే 10వేలకు పైగా EVలను అమ్మినట్లు పేర్కొంది. జీఎస్టీ 2.0, పండుగలు కలిసొచ్చినట్లు వివరించింది.
News October 22, 2025
డీఏ జీవోలో మార్పులు

AP: రిటైర్మెంట్ సమయంలో డీఏ బకాయిలు కలిపేలా నిన్న ఇచ్చిన జీవోలో ప్రభుత్వం మార్పులు చేసింది. డీఏ బకాయిల్లో 10 శాతాన్ని ఏప్రిల్‌లో చెల్లించాలని, మిగిలిన 90% బకాయిలు తదుపరి 3 వాయిదాల్లో (2026 ఆగస్టు, నవంబర్, 2027 ఫిబ్రవరి) చెల్లించాలని సవరణ జీవో రిలీజ్ చేసింది. OPS ఉద్యోగుల పెండింగ్ డీఏలను GPF ఖాతాకు జమ చేయాలని, CPS, PTD ఉద్యోగులకు 90% బకాయిలు నగదుగా ఇవ్వాలని నిర్ణయించింది.