News October 21, 2025
NZB: అమరుడా నీకు వందనం

పోలీసులు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో 5 రోజుల క్రితం NZBలో విధి నిర్వహణలో అమరుడైన CCS కానిస్టేబుల్ ప్రమోద్‌కు పోలీసులతో పాటు జిల్లా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. నగరంలోని గూపన్పల్లికి చెందిన ప్రమోద్ 2003 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 3 నెలల క్రితం ట్రాఫిక్ విభాగంలో పని చేసిన ఆయన ఇటీవలే CCSకు బదలీ అయ్యారు. ఆయన సోదరుడు కూడా కానిస్టేబులే. జోహార్ ప్రమోద్.
Similar News
News October 21, 2025
MHBD: ఎలక్షన్లని ఊరించారు.. తీరా ఆపేశారు..!

TGలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో MHBD జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. తీరా BCలకు 42% రిజర్వేషన్‌కు కోర్టు స్టే ఇవ్వడంతో ఎలక్షన్ వాయిదా పడింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి 20 నెలలు కావొస్తుండగా.. ఎలక్షన్లు జరిగి సర్పంచ్‌ని ఎన్నుకుంటే గ్రామ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు అనుకున్నారు. ఎన్నికలు ఊరించి ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఆశావహులు నిరాశ చెందారు. MHBD జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
News October 21, 2025
ధాన్యం కొనుగోలు పై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలి: అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేయబోయే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల
ఇన్‌ఛార్జ్‌లకు రెండు రోజులలో ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేయబోయే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లకు ధాన్యం కొనుగోళ్లపై పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని చెప్పారు.
News October 21, 2025
సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: నిర్మల్ కలెక్టర్

తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. www.telangana.gov.in /telanganarising వెబ్ సైట్‌ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను ఇవ్వాలని కోరారు.