News October 21, 2025
నేడు నెల్లూరు జిల్లాకు వర్ష సూచన

నెల్లూరు జిల్లాలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్స్యకారులు తిరిగి రావాలని సూచించింది. దీపావళి రోజు వర్షం పడటంతో చాలామంది టపాసులు సరిగా పేలలేదు.
Similar News
News October 21, 2025
రేపు పాఠశాలలకు సెలవు: నెల్లూరు DEO

నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రాజా బాలాజీ రావు తెలిపారు. వాతావరణ శాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయా మండలాల విద్యాధికారులు పాఠశాలలకు సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News October 21, 2025
కావలిలో రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

కావలిలోని బుడంగుంట రైల్వే గేటు సమీపంలో మంగళవారం రైలు కిందపడి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రైలు పట్టాలపై మహిళ మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, మృతురాలు పూర్తి వివరాలు తెలియాల్సింది.
News October 21, 2025
కందుకూరులో పోలీసులు అతి: YCP

కందుకూరులో పోలీసులు చాలా అతి చేస్తున్నారని YCP మండిపడింది. ‘TDPగూండాల చేతిలో దారుణ హత్యకి గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న YCP నేత అంబటి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు టీడీపీ నేతలే కావడంతో ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయట్లేదు. అఖరికి పరామర్శకు సైతం దూరం చేస్తూ కాపులపై కక్ష సాధిస్తున్నావా చంద్రబాబు’ అని వైసీపీ ప్రశ్నించింది.