News October 21, 2025
కృష్ణా: జోగి రమేష్ అరెస్ట్ ఆలస్యం.. అందుకేనా..?

కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ తప్పదని వార్తలు వచ్చాయి. తనను అరెస్టు చేస్తే గౌడ సామాజిక వర్గం మొత్తం రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తుందని జోగి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపుల తర్వాత గౌడ వర్గీయుల సంఖ్య అధికంగా ఉంది. అరెస్టు చేస్తే బలమైన BC సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందేమో అని కూటమి సందేహిస్తున్నట్లు తెలుస్తుంది.
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్: నేటి నుంచి నామినేషన్ల పరిశీలన..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక నేటి నుంచి వాటి పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. వందలాది నామినేషన్లు రావడంతో పూర్తి పరిశీలనకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉంది.

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 22, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.