News October 21, 2025

పార్వతీపురం మన్యం: మీ సేవలు మరువం..!

image

రేయింబవళ్లు కష్టపడి శాంతిభద్రతలను కాపాడే రక్షభటులకే కొన్ని సందర్భాల్లో రక్షణ కరువవుతోంది. పార్వతీపురం జిల్లాలో సీఐ ముద్దాడ గాంధీ, ఏ.ఆర్ కానిస్టేబుల్ షేక్ ఇస్మాయిల్, సివిల్ కానిస్టేబుల్లు బి.శ్రీరాములు, సీహెచ్.చిరంజీవిరావు, ఎస్.సూర్యనారాయణ విధుల్లో ఉండగా ప్రాణాలు విడిచారు. నేడు ‘పోలీసు అమరవీరుల సమస్మరణ దినోత్సవం’ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ పార్వతీపురంలో స్మృతి పరేడ్ నిర్వహించనున్నారు.

Similar News

News October 21, 2025

రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్

image

రామగుండంలో 80O మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లినట్లు MLA- MSరాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనను HYDలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. పాలకుర్తి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి గ్రామాలకు తాగు నీరు, పంటలకు సాగునీరు అందివ్వాలని కోరారు.

News October 21, 2025

డీజే ఓ నిశ్శబ్ద హంతకి

image

పట్టణం, పల్లెలో డీజే శబ్దాలు హోరెత్తిస్తున్నాయి. శబ్ద తీవ్రత 50 డేసిబెల్స్ దాటితే మానవులకు గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నియమాలను నిర్వాహకులు పెడచెవిన పెట్టి పెద్ద శబ్దాలకు 100 డేసిబెల్స్‌ పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల16న నరసన్నపేటలోని <<18018296>>భవానిపురంలో<<>> గౌరమ్మ ఊరేగింపులో డీజే శబ్దానికి భవనం కూలి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

News October 21, 2025

మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాల స్థాయిని పెంచాలి: కలెక్టర్

image

జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో మంగళవారం మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్దరణ, తదితర అంశాలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలో భూగర్భ జలాల స్థాయి తక్కువగా ఉందని, భూగర్భ జలాల స్థాయిని గణనీయంగా పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.