News October 21, 2025
HYD: పోలీస్ బాస్.. మీ సేవలకు సెల్యూట్

నిజాయితీకి ప్రతీక, ధైర్యానికి పర్యాయపదం ఉమేశ్ చంద్ర ఐపీఎస్. వరంగల్‌లో ASPగా నక్సలైట్లను అణచివేశారు. కడప SPగా ఫ్యాక్షన్‌ను కట్టడి చేసి ‘కడప సింహం’గా ఖ్యాతి గడించారు. కరీంనగర్‌లో శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. చివరగా AIGగా సేవలందించారు. ప్రజల కోసం పోరాడి ‘ప్రజల పోలీస్’గా పేరుగాంచారు. ఆయన బదిలీ వార్తపై ప్రజలు రోడ్డెక్కి కన్నీరు పెట్టారు. 1999 SEP 4న HYD SRనగర్‌లో నక్సలైట్ల దాడిలో కన్నుమూశారు.
Similar News
News October 21, 2025
సికింద్రాబాద్: ఆ ట్రైన్ తాత్కాలికంగా రద్దు

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు గోరఖ్‌పుర్ ట్రైన్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నగరం నుంచి గోరఖ్‌పుర్‌కు వీక్లీ ట్రైన్ ప్రయాణికులకు సేవలందించేది. అయితే నవంబర్ 28 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఈ రైలు (07075- 07076)ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరారు.
News October 21, 2025
HYD: ప్రభుత్వం వద్దకు మెట్రో.. సిబ్బందిలో టెన్షన్..!

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం మెట్రో రైల్ ప్రాజెక్టులో 1,300 మంది రెగ్యులర్ స్టాఫ్, 1,700 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. మెట్రో రైల్ నిర్వహించే ఎల్ అండ్ టీ సంస్థకు ఫ్రాన్స్ సంస్థ కియోలిస్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న స్టాఫ్ తమ పరిస్థితి ఏమిటో అని ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.
News October 21, 2025
BREAKING: HYD: అల్కాపురి టౌన్‌షిప్‌లో యాక్సిడెంట్

HYD పుప్పాలగూడ పరిధి అల్కాపురి టౌన్‌షిప్‌లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే నవీన్, తన కుమారుడు కుశల జోయల్‌తో కలిసి వస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.