News October 21, 2025
‘కడప సింహం’ ఉమేశ్ చంద్ర IPS.!

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిందే. ఈ కోవకు చెందినవారే ఉమేశ్ చంద్ర IPS. 1994 అక్టోబరులో మొదటిగా పులివెందులలో పనిచేశారు. 1995 జూన్‌లో కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. ఆ సమయంలో కడప SPగా ఫ్యాక్షన్‌ను కట్టడి చేసి ‘కడప సింహం’గా ఖ్యాతి గడించారు. అయితే 1999 SEP 4న HYD SRనగర్‌లో నక్సలైట్ల దాడిలో కన్నుమూశారు.
Similar News
News October 22, 2025
NZB: ‘తెలంగాణ రైజింగ్-2047’ సర్వేకు విశేష స్పందన

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్-2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.
News October 22, 2025
ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు

కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న ఆదికర్మ యోగి పథకం కింద క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనులకు గాను ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు లభించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్‌లను అభినందించారు.
News October 22, 2025
NZB: రియాజ్ కేసు విచారణలో ఉంది: డీజీపీ

నిజామాబాద్‌లో రియాజ్ కేసు విచారణలో ఉందని, పూర్తి వివరాలు వెల్లడించలేమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రియాజ్‌ను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించి గాయపడ్డ ఆసీఫ్ కుటుంబానికి రూ.50 వేలు రివార్డు అందించామన్నారు. రాష్ట్రంలో 65 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు.