News October 21, 2025
కొయ్యలగూడెం అమ్మాయికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

“ముదితల్ నేర్వగరాని రాని విద్య కలదే ముద్దారగ నేర్పింపగన్” అన్న ఆర్యోక్తి దాసరోజు అలేఖ్యకి వర్తిస్తుంది. కోచ్, తండ్రి శ్రీధర్ పర్యవేక్షణలో తొమ్మిదవ తరగతి విద్యనభ్యసించే కొయ్యలగూడెం విద్యార్థి అలేఖ్య కరాటే విభాగంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పలు పతకాలు సొంతం చేసుకుంది. చెన్నైలో గత నెల 18న నిర్వహించిన సెలక్షన్స్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది.
Similar News
News October 22, 2025
HYD: తెలుగు వర్శిటీ.. క్రికెట్ జట్టు కెప్టెన్లు వీరే!

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో క్రికెట్ టోర్నీ బుధవారం నిర్వహిస్తున్నట్లు వర్శిటీ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్ Way2Newsతో తెలిపారు. జట్టు సారథులను ఎంపిక చేశామన్నారు.1.TU డెవిల్స్ జట్టు కెప్టెన్‌గా అమీర్ 2.TU సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ముస్తాక్ 3.TU ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్‌గా వినోద్ 4.TU వారియర్స్ జట్టు కెప్టెన్‌గా ప్రవీణ్ 5.TU ది డామినేటర్స్ జట్టు కెప్టెన్‌గా అరుణ్
News October 22, 2025
NZB: ‘తెలంగాణ రైజింగ్-2047’ సర్వేకు విశేష స్పందన

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్-2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.
News October 22, 2025
ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు

కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న ఆదికర్మ యోగి పథకం కింద క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనులకు గాను ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు లభించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్‌లను అభినందించారు.