News October 21, 2025

విశాఖ-పార్వతీపురం స్పెషల్ ట్రైన్‌పై మీ కామెంట్

image

విశాఖ-పార్వతీపురం స్పెషల్ ట్రైన్‌కు డైలీ నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. అధిక సంఖ్యలో ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. విశాఖలో ఉ.10కు బయలుదేరి పార్వతీపురం మ.12.20కు చేరుకుంటుంది. తిరిగి పార్వతీపురంలో మ.12.45కు బయలుదేరి సా.4గంటలకు విశాఖ వెళ్లనుంది. సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరంలో ఆగే ఈ ట్రైన్ ఈనెల 27వరకు నడవనుంది.

Similar News

News October 21, 2025

పంటపొలాలకు సాగునీటి పై దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందించేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో జలవనరుల శాఖ అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు నీటి కాలువలు కింద ఉన్న తాగునీటి చెరువులను నింపుటకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. గుంటూరు ఛానల్ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

News October 21, 2025

భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్

image

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జై సూర్య‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. డీఎస్పీ పరిధిలో పేకాట స్థావరాలు పెరగడం, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారశైలిపై జిల్లా ఎస్పీ అదాన్ నయీమ్ అస్మితో మంగళవారం మాట్లాడిన పవన్, వెంటనే డీఎస్పీపై విచారణకు ఆదేశించి, నివేదికను హోం శాఖకు, డీజీపీకి పంపించాలని ఆదేశించారు.

News October 21, 2025

జూబ్లీహిల్స్: బీజేపీ ర్యాలీలో టీడీపీ జెండాలు..!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ ఈరోజు భారీగా జరిగింది. అయితే ర్యాలీలో బీజేపీ జెండాలతోపాటు టీడీపీ జెండాలు కూడా దర్శనమిచ్చాయి. పలువురు కార్యకర్తలు టీడీపీ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఆంధ్రలో కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనేసేన కార్యకర్తలు పాల్గొని లంకల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.