News October 21, 2025
నాడు వణికిన అదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్‌ను వణికించిన నక్సల్ దాడుల్లో పోలీసుల త్యాగాలు మరువలేనివి. 1987 ఆగస్టు 18న కడెం మండలం అద్దాల తిమ్మాపూర్ వద్ద సాగర్ దళ కమాండర్ మాటువేసి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఎస్సైలతో సహా 10 మంది పోలీసులు అమరులయ్యారు. 1989లో సింగాపూర్ వద్ద జీపు పేల్చివేతలో ఎస్సై ఖాదర్‌లాక్‌తో సహా ఏడుగురు, 1999లో తర్లుపాడ్ పేలుడులో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News October 21, 2025
భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జై సూర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. డీఎస్పీ పరిధిలో పేకాట స్థావరాలు పెరగడం, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారశైలిపై జిల్లా ఎస్పీ అదాన్ నయీమ్ అస్మితో మంగళవారం మాట్లాడిన పవన్, వెంటనే డీఎస్పీపై విచారణకు ఆదేశించి, నివేదికను హోం శాఖకు, డీజీపీకి పంపించాలని ఆదేశించారు.
News October 21, 2025
జూబ్లీహిల్స్: బీజేపీ ర్యాలీలో టీడీపీ జెండాలు..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ ఈరోజు భారీగా జరిగింది. అయితే ర్యాలీలో బీజేపీ జెండాలతోపాటు టీడీపీ జెండాలు కూడా దర్శనమిచ్చాయి. పలువురు కార్యకర్తలు టీడీపీ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఆంధ్రలో కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనేసేన కార్యకర్తలు పాల్గొని లంకల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.
News October 21, 2025
పాడేరు: ‘పెండింగ్‌లో భూ సమస్యలను తక్షణం పరిష్కరించాలి’

పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత రీసర్వేలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకంలో పెండింగ్‌లోని దరఖాస్తు మ్యుటేషన్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.