News October 21, 2025
ట్రంపే కాదు.. ఆయన సెక్రటరీ అంతే!

US ప్రెసిడెంట్ ట్రంప్ నోటి దురుసు గురించి తెలిసిందే. ఈ విషయంలో తానేం తక్కువ కాదని వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ నిరూపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు త్వరలో ట్రంప్, పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో భేటీ కానున్నారు. ఈ హైలెవెల్ సమ్మిట్‌కు ఆ లొకేషన్ ఎవరు ఎంపిక చేశారని ఓ జర్నలిస్ట్ కరోలిన్‌కు మెసేజ్ చేశారు. ‘మీ అమ్మ చేసింది’ అని ఆమె బదులివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
Similar News
News October 21, 2025
చేత్తో తినాలా.. స్పూన్‌తోనా.. ఏది సేఫ్?

విదేశీ కల్చర్‌కు అలవాటు పడి చాలామంది స్పూన్‌తో తింటుంటారు. అదే సేఫ్ అని భావిస్తుంటారు. కానీ అది అపోహేనని రీసెంట్ స్టడీస్ తేల్చాయి. ‘చేత్తో తింటే గాలి తక్కువగా లోనికి వెళ్లి గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలానే అన్నం-కూర బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, సహజత్వం, టైమ్ మేనేజ్మెంట్, ఫీల్, ఫుడ్ సేఫ్టీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి’ అని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మన భారతీయ సంప్రదాయమని కొందరు అంటున్నారు. మరి మీరేమంటారు?
News October 21, 2025
మనందరి తొలి ఆర్ట్ టీచర్ ఈయనే.. ఏమంటారు?

మనలో చాలా మంది సృజనాత్మకతను తొలిసారి బయటకు తీసింది POGO ఛానల్‌లో వచ్చిన ‘M.A.D. with Rob’ షోనే. ఇది 90S కిడ్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హోస్ట్ రాబ్ మనందరి తొలి ఆర్ట్ టీచర్. ఆయన వేస్ట్ నుంచి బెస్ట్ క్రాఫ్ట్స్ ఎలా చేయాలో చక్కగా వివరించేవారు. దాన్ని ఫాలో అయి మనమూ రూపొందిస్తే పేరెంట్స్ సంతోషించేవారు. అందుకే ఈ షో చూసేందుకు వారు ప్రోత్సహించేవారు. దీనిని మరోసారి ప్రసారం చేయాలనే డిమాండ్ నెలకొంది.
News October 21, 2025
ఒంబ్రొఫోబియా: వర్షం అంటే వణుకే!

కొందరికి వర్షం అంటే భయం. దాన్ని ఒంబ్రొఫోబియా అంటారు. పిల్లలు, టీనేజర్లకు ఈ ఫోబియా ఎక్కువగా ఉంటుంది. వీరు పదే పదే వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకుంటారు. వర్షం పడితే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇంటినుంచి బయటకు వెళ్లరు. వర్షం ఆగినా కొన్ని గంటల పాటు ఇంటికే పరిమితమవుతారు. గుండె దడ, వణుకు, భయం, ఛాతినొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫోబియాకు ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.