News October 21, 2025

భద్రాద్రి: ఆ విషాదానికి 28 ఏళ్లు..ఎప్పటికీ మర్చిపోలేం

image

కరకగూడెం ఠాణాపై మావోయిస్టులు మెరుపు దాడి చేసి 16 మంది పోలీసులను బలిగొన్న విషాద ఘటనకు 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని పినపాక(M) పూర్తి నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంగా ఉండేది. 1997 జనవరి 9న అర్ధరాత్రి సుమారు 100 మంది మావోయిస్టులు కరకగూడెం ఠాణాపై దాడికి పాల్పడి, స్టేషన్‌ను పేల్చివేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా, పోలీసులు ప్రతిదాడి చేసేలోపే మావోయిస్టులు స్టేషన్‌ను లూటీ చేసి వెళ్లిపోయారు.

Similar News

News October 21, 2025

చేత్తో తినాలా.. స్పూన్‌తోనా.. ఏది సేఫ్?

image

విదేశీ కల్చర్‌కు అలవాటు పడి చాలామంది స్పూన్‌తో తింటుంటారు. అదే సేఫ్ అని భావిస్తుంటారు. కానీ అది అపోహేనని రీసెంట్ స్టడీస్ తేల్చాయి. ‘చేత్తో తింటే గాలి తక్కువగా లోనికి వెళ్లి గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలానే అన్నం-కూర బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, సహజత్వం, టైమ్ మేనేజ్మెంట్, ఫీల్, ఫుడ్ సేఫ్టీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి’ అని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మన భారతీయ సంప్రదాయమని కొందరు అంటున్నారు. మరి మీరేమంటారు?

News October 21, 2025

HYD: BRSలో చేరిన BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్

image

BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ ఈరోజు BRSలో చేరారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి HYDలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహ్మద్ బిన్ అలీ అల్ గుత్మి కూడా ఆమెతోపాటు BRSలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు నిజమైన అభివృద్ధి జరుగుతుందని, అందుకే BRSలో చేరుతున్నట్లు వారు చెప్పారు.

News October 21, 2025

పర్వతగిరిలో కోతుల అత్యవసర సమావేశం..!

image

గ్రామాల్లో కోతులు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను లాక్కెళ్తుంటాయి. వాటిని తరమడానికి వస్తే దాడి చేసి గాయపరుస్తుంటాయి. పంటలు, ఇంటి పెరట్లో వేసిన పండ్లు, కూరగాయల మొక్కలను ధ్వంసం చేస్తుంటాయి. పై ఫొటోను చూస్తే WGL(D) పర్వతగిరి(M)లో రేపటి కార్యక్రమం గురించి కోతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఉంది. కోతుల సమస్య మీ ఊర్లో ఉందా? ఇంతకీ సమావేశం దేనికోసమని అనుకుంటున్నారు?