News October 21, 2025
జూబ్లీ బైపోల్.. నేటితో నామినేషన్ల గడువు పూర్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 24న ఉపసంహరణకు తుది గడువు. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Similar News
News October 22, 2025
సంగారెడ్డి: ‘పర్యాటక కేంద్రంగా మంజీరా’

మంజీరా తీరాన పర్యటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంజీర నది తీరంలో ప్రకృతి వైభవాన్ని వినియోగించుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News October 22, 2025
మెదక్: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25న ముగుస్తుందన్నారు.
News October 22, 2025
ఐస్‌లాండ్‌లో కనిపించిన దోమలు

ఇందులో విడ్డూరం ఏముంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ మంచు దేశానికి దోమలు లేని దేశంగా పేరుంది. తాజాగా వెస్టర్న్ ఐస్‌ల్యాండ్‌లోని ఓ అడవిలో ఈ దోమలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్నేళ్ల కిందట విమానంలో ఓ దోమను గుర్తించగా తాజాగా సహజ వాతావరణంలోనే ఈ కీటకాలను కనుగొన్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ఎలా వచ్చాయనే విషయమై కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా ఇది మారిన వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతోంది.