News October 21, 2025

SRPT: ఠాణాపై దాడికి 17 ఏళ్లు.. ఇద్దరు పోలీసులు మృతి

image

తిరుమలగిరి ఠాణాపై నక్సల్స్ దాడి చేసి, ఇద్దరు పోలీసులను బలిగొన్న విషాద ఘటనకు 17 ఏళ్లు. 2007 జులై 7న సుమారు 40 మంది నక్సల్స్ ఠాణాపై దాడికి పాల్పడి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ శ్రీరాంరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బడేసాబ్‌లపై కాల్పులు జరిపి వారిని చంపారు. అనంతరం స్టేషన్‌లో ఉన్న ఆయుధాలను అపహరించుకు పోయారు. ఆనాటి అమరవీరుల త్యాగాన్ని జిల్లా ప్రజలు స్మరించుకున్నారు.

Similar News

News October 21, 2025

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: జనగామ కలెక్టర్

image

పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ముందుగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు.

News October 21, 2025

బొబ్బిలిలో మానవత్వం మంట కలిసింది..

image

స్పృహతప్పి పడిపోయిన మహిళను ఆసుపత్రికి తరలించాల్సిన జనం పూర్తిగా పట్టించుకోలేదు. బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి ఆటో స్టాండ్‌లో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఆమె రక్తపు మడుగుల్లో ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. అటువైపు వెళ్తున్న ఎస్ఐ రమేశ్, సిబ్బంది చూసి సపర్యలు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 21, 2025

ఆక్వా రైతులకు శుభవార్త చెప్పిన లోకేశ్

image

AP: ఆక్వా రైతులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు తెల్లమచ్చ వైరస్ కారణంగా పొట్టు తీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా పరిమితులు విధించగా తాజాగా వాటిని ఎత్తివేసి ఎగుమతులకు అనుమతించిందని మంత్రి చెప్పారు. దీనికోసం కృషిచేసిన ఇండియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త మార్కెట్లకు విస్తరించాల్సిన అవసరముందని ఇది నిరూపిస్తోందని వివరించారు.