News October 21, 2025
లింగంపేట అమరవీరుల స్థూపం వద్ద FLAG DAY

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ ఫ్లాగ్ డేను చందుర్తి మండలం లింగంపేటలోని అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎం.హరిత, జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే హాజరుకానున్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు.
Similar News
News October 21, 2025
ఇండియాపై పాక్ ఆరోపణలు.. దీటుగా బదులిచ్చిన అఫ్గాన్

ఇటీవల జరిగిన సరిహద్దు ఘర్షణల్లో ఇండియా హస్తం ఉందంటూ పాక్ చేసిన ఆరోపణలపై అఫ్గాన్ దీటుగా స్పందించింది. అవి నిరాధార, ఆమోదయోగ్యంకాని ఆరోపణలని మండిపడింది. ఓ స్వతంత్ర దేశంగా భారత్‌తో బంధం కొనసాగిస్తామని అఫ్గాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్ స్పష్టంచేశారు. ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ భూభాగాలను వాడుకునేందుకు ఎన్నటికీ అనుమతివ్వబోమని చెప్పారు. పాక్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని అన్నారు.
News October 21, 2025
ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి పెట్టండి: కలెక్టర్

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి సారించాలని, అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్‌తో పాటు విద్యాశాఖ అధికారులతో పూర్వ ప్రాథమిక విద్యపై కలెక్టర్ సమీక్ష చేశారు. ప్రాథమిక విద్యలోనే ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు 20 మంది రిసోర్స్ పర్సన్లను నియమించాలన్నారు.
News October 21, 2025
అంబర్‌పేట్‌లో బాణసంచా వివాదం.. పది మందిపై కేసు నమోదు

HYD అంబర్‌పేట్‌లో బాణసంచా వివాదం ఘర్షణగా మారింది. దీపావళి వేళ రాత్రి 11:30 గంటల సమయంలో సుధా పార్టీ నివాసం వద్ద పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాణసంచా పేల్చుతూ శబ్ద కాలుష్యం సృష్టించారు. వారికి స్థానిక మహిళ నిర్మల అడ్డు చెప్పగా ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారు. ఈ మేరకు బాధితురాలు అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.