News October 21, 2025
మెదక్ యువకుడికి 8 GOVT జాబ్స్

పాపన్నపేట(M) పొడ్చన్‌పల్లికి చెందిన అరక అజయ్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జ్యోతి, సంజీవరావుల కుమారుడు అజయ్ ఇప్పటివరకు ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరిన ఆయన.. SCR లోకో పైలట్, కానిస్టేబుల్, ఆర్ఎస్ఐగా ఎంపికయ్యారు. 2023లో SIగా ఎంపిక కాగా, తాజాగా గ్రూప్-2లో ప్రతిభ సాధించి ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించారు.
Similar News
News October 22, 2025
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఇవాళ 10amకు హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరుతారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు.
News October 22, 2025
కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.
News October 22, 2025
అక్కన్నపేట: విద్యుత్ స్తంభమెక్కిన పొదలు

అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపై వెలుగుతున్న వీధి దీపానికి చెట్టు తీగ స్తంభం పైకి ఎక్కింది. వెలుతురును కనపించని విధంగా తీగ వీధి దీపం చుట్టూ అలుముకుంది. దీనిని చూసిన పలువురు విద్యుత్ దీపానికి కంచె మాదిరిగా ఉందంటూ సంభాషించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వెలుతురుకు అడ్డుగా ఉన్న తీగను అధికారులు తొలగించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.


