News October 21, 2025

జగిత్యాల: ఉరివేసుకొని యువకుడి సూసైడ్

image

జగిత్యాల(D) ధర్మపురి మండలం దమ్మన్నపేటకి చెందిన జగిశెట్టి సచిన్(29) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సచిన్‌కు చిన్నతనంలో చేతికి తగిలిన గాయం కారణంగా ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. ఇందుకోసం హైదరాబాద్‌లో వైద్యం చేయించారు. 6 నెలల వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే అనారోగ్యం కారణంతో సచిన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Similar News

News October 21, 2025

ఇండియాపై పాక్ ఆరోపణలు.. దీటుగా బదులిచ్చిన అఫ్గాన్

image

ఇటీవల జరిగిన సరిహద్దు ఘర్షణల్లో ఇండియా హస్తం ఉందంటూ పాక్ చేసిన ఆరోపణలపై అఫ్గాన్ దీటుగా స్పందించింది. అవి నిరాధార, ఆమోదయోగ్యంకాని ఆరోపణలని మండిపడింది. ఓ స్వతంత్ర దేశంగా భారత్‌తో బంధం కొనసాగిస్తామని అఫ్గాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్ స్పష్టంచేశారు. ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ భూభాగాలను వాడుకునేందుకు ఎన్నటికీ అనుమతివ్వబోమని చెప్పారు. పాక్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని అన్నారు.

News October 21, 2025

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి పెట్టండి: కలెక్టర్

image

ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల భాషపై దృష్టి సారించాలని, అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్‌తో పాటు విద్యాశాఖ అధికారులతో పూర్వ ప్రాథమిక విద్యపై కలెక్టర్ సమీక్ష చేశారు. ప్రాథమిక విద్యలోనే ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు 20 మంది రిసోర్స్ పర్సన్లను నియమించాలన్నారు.

News October 21, 2025

అంబర్‌పేట్‌లో బాణసంచా వివాదం.. పది మందిపై కేసు నమోదు

image

HYD అంబర్‌పేట్‌లో బాణసంచా వివాదం ఘర్షణగా మారింది. దీపావళి వేళ రాత్రి 11:30 గంటల సమయంలో సుధా పార్టీ నివాసం వద్ద పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాణసంచా పేల్చుతూ శబ్ద కాలుష్యం సృష్టించారు. వారికి స్థానిక మహిళ నిర్మల అడ్డు చెప్పగా ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారు. ఈ మేరకు బాధితురాలు అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.