News October 21, 2025

MBNR: డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 24 వరకు చెల్లించాలని, ఈనెల 29 వరకు ఫైన్ (లేట్ ఫీజు)తో ఫీజులు చెల్లించాలని తెలిపారు. అలాగే మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ ఫీజును ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 25 వరకు, లేట్ ఫీజుతో ఈనెల 29 వరకు పరీక్షల ఫీజులు చెల్లించాలని కోరారు.

Similar News

News October 21, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో డబుల్ సెంచరీ దాటనున్న నామినేషన్స్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల హీట్ పెరుగుతోంది. అంచనాలను మించి అభ్యర్థుల రద్దీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో టోకెన్లు తీసుకున్న వారి వద్ద నుంచి RO నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా నామినేషన్లు డబుల్ సెంచరీ దాటే సూచనలు కనిపిస్తున్నాయి.

6 లక్షల వర్కర్ల స్థానంలో రోబోలు.. అమెజాన్ ప్లాన్!

image

ఆటోమేషన్ దిశగా అమెజాన్ అడుగులేస్తోంది. 2033 నాటికి అమెరికాలో 6 లక్షల ఉద్యోగాలను రోబోలతో ఆ సంస్థ భర్తీ చేయనున్నట్లు The New York Times నివేదిక వెల్లడించింది. కంపెనీ మొత్తం కార్యకలాపాలలో 75% ఆటోమేట్ చేసే దిశగా రోబోటిక్ టీమ్ పని చేస్తోందని చెప్పింది. 2027 నాటికి భర్తీ చేయాల్సిన 1.6 లక్షల జాబ్స్‌నూ కట్ చేయొచ్చని అంచనా వేసింది. ఆటోమేషన్‌తో 2025-2027 మధ్య $12.6B ఆదా అవుతాయని భావిస్తున్నట్లు తెలిపింది.